let us build up anti corrupt society!!

utf fights against apprenticeship of teachers

16/09/2011 17:09

 

 
 
  6 రోజుల నిరాహార దీక్ష తో మన యు. టి. ఎఫ్ అధ్యక్షులు శ్రీ N నారాయణ మరియు M L C లు లక్ష్మణ రావు మరియు శ్రీనివాసుల రెడ్డి గార్ల   ఆరోగ్యము  క్షీణించింది. అయినా మొక్కవోని దీక్షతో నిరాహార దీక్ష కొనసాగిస్తుండగా  5 వ రోజు రాత్రి  ప్రభుత్వం  అరెస్టు చేసి  గాంధి ఆసుపత్రికి తరలించింది. ఆయినా నాయకులూ ఆరోరోజు కుడా  దీక్ష   కొనసాగించారు.ఈ రోజు 7 వరోజు దీక్ష  కొనసాగుతుంది.    
 .ఉపాధ్యాయ వృత్తిలో అప్రెంటిస్ వ్యవస్థను రద్దు చేయాలి. జి.ఓ 130 ని రద్దు చేయాలని కోరుతూ నాయకుల అరెస్ట్ కు వ్యతిరేఖంగా 12-9-2011 న జిల్లా కేంద్రాలలో జరిగిన  పికేటింగులో ఉపాద్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యయులంతా ఆందోళనను ఉధృతం చేయవలసిన పరిస్థితి. పరిస్తితులను అవగాహన చేసుకోకుండా నిర్లిప్తంగా ఉన్నవాళ్ళను మేల్కొలపండి.  తెలియకుండానే ఉద్యమ ఫలితాలు అనుభవిస్తూ ఉద్యమాలను గేలిచేస్తూ మాట్లాడే దుష్టులపై / ఆత్మాభిమానం లేనివారిపై కోపం వద్దు.ప్రతి ఉద్యమం లోను అటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆఖరికి అది స్వాతంత్ర్య ఉద్యమం అయిన సరే.
   ఆత్మాభిమానం తో ఉద్యోగ జీవితాన్ని గడపాలనుకొనే వారికి ఈ జి. ఓ. 130 ఒక శాపం అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. కళ్ళముందే జరుగుతున్నా వెట్టి చాకిరి " అప్రెంటిస్ వ్యవస్థ" అని గుర్తించాలి. రండి. ఈ అన్యాయాలకు వ్యతిరేఖం గా పోరాడుదాం.

 

Photo used under Creative Commons from VinothChandar  © 2011 All rights reserved.

Create a website for freeWebnode